Tuesday, September 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు

గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
గణేష్ మండపాల నిర్వాహకులు ప్రైవేట్ ఎలక్ట్రిషన్లకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పలు సూచనలు చేశారు. మండపాలను విద్యుత్ లైన్ల క్రింద లేదా విద్యుత్ లైన్లకు/ట్రాన్స్‌ఫార్మర్లకు దగ్గరగా ఏర్పాటు చేయరాదు. 2. మండపాలలో ఈ ఎల్ సి బి (Earth Leakage Circuit Breaker) అవసరమైన ఎంసీబీఎస్ ఏర్పాటు చేయాలి. మండపాల వైరింగ్‌ను లైసెన్స్ పొందిన ఎలక్ట్రీషియన్ ద్వారానే చేయాలి. వైరింగ్‌లో ఎక్కడా జాయింట్లు లేకుండా చూసుకోవాలి. కనెక్ట్ అయిన లోడుకు సరిపోయే రేటెడ్ కేబుల్ వైర్లు, సరైన ఇన్సులేషన్‌తో ఉపయోగించాలి.సర్వీస్ కేబుల్స్ హుకింగ్ చేయరాదు. విద్యుత్ వైర్లు ఇనుప పైపులకు తగలకుండా చూడాలి. అవసరమైతే తగిన ఇన్సులేషన్ పెట్టాలి. వైర్లు నేలమీద వేయరాదు.

తప్పనిసరిగా వేయాల్సివస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన ఎర్తింగ్‌తో 3-పిన్ ప్లగ్‌లు ఉపయోగించాలి.మండపాల నిర్మాణంలో ఇనుప పైపులు వాడితే వాటిని ఇన్సులేషన్ పదార్థంతో కవర్ చేయాలి. సర్వీస్ వైరు పోలుకు ఫిక్స్ చేసిన తర్వాత, సంబంధిత లైన్‌మన్ లేదా జేఎల్ఎం అనుమతి లేకుండా మార్పులు చేయరాదు.ఇన్వర్టర్ లేదా జనరేటర్ వాడితే రిటర్న్ కరెంట్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.కావున గణేష్ మండపాల నిర్వాహకులు మరియు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు తప్పనిసరిగా పై సూచనలు పాటించాలని  నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య తెలియజేసారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -