- Advertisement -
నవతెలంగాణ -తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మొండాలతోగు గుత్తి కోయ గూడెం యువతకు బుధవారం తాడ్వాయి ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి, పస్రా సిఐ గద్ద రవీందర్ తో కలిసి జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేసి వారికి క్రమశిక్షణ విషయాలు విన్నవించి, వాలీబాల్ కిట్లను అందజేశారు. జలగలంచ వద్దు జరుగుతున్న పరిశీలించారు. అనంతరం రోడ్డు ప్రమాదాలు నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మేడారం వెళ్లే రహదారిపై చెట్లు పడితే వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని తొలగించారు. ఈ విధంగా తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి మండల వ్యాప్తంగా చేస్తున్న విస్తృత సేవలు అభినందనీయమని మండల ప్రజలు హర్షిస్తున్నారు
- Advertisement -