దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పోలీస్ వారి హెచ్చరిక’. తూలికా తనిష్క్ క్రియే షన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ సినీ పెద్దల సమక్షంలో లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ,’ మనమంతా ఇక్కడికి వచ్చామంటే కారణం బాబ్జి మీద ఉన్న గౌరవం. అలాగే ఆర్మీ నుండి వచ్చిన నిర్మాత జనార్ధన్‌తో కలిసి క్రమశిక్షణతో ఈ సినిమాను చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
‘నేను జీవితంలో ముగ్గురిని నమ్ముకున్నాను. తల్లిదండ్రులను, భారతదేశాన్ని అలాగే ఇప్పుడు కళామతల్లిని. నేడు నన్ను కళామతల్లి నిలబెడుతుంది అని నమ్ముతున్నాను. ఈనెల 18వ తేదీన మా సినిమాని అందరూ చూసి మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను’ అని నిర్మాత బెల్లి జనార్ధన్ చెప్పారు.
దర్శకుడు బాబ్జి మాట్లాడుతూ,”సినిమాల కోసం పనిచేసేవారు తాము చేసిన సినిమా విడుదలైన ప్రతిసారి పుడుతూనే ఉంటారు. సినిమా కోసమే పుట్టామని భావిస్తాం. ఓ మంచి కంటెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. కచ్చితంగా మీ అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు. ఇంకా ఈ వేడుకలో నటి ఇంద్రజ, నటుడు శుభలేఖ సుధాకర్ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. సన్నీ అఖిల్, అజరు ఘోష్, రవి కాలే, షాయాజీ షిండే, శుభలేఖ సుధాకర్, కాశీ విశ్వనాథ్, జబర్దస్త్ వినోద్, జబర్దస్త్ పవన్, జబర్దస్త్ శాంతి స్వరూప్, హిమజ, శంకరాభరణం తులసి, జయ వాహిని, మేఘనా ఖుషి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : గజ్వేల్ వేణు, కెమెరా : కిషన్ సాగర్, నళినీ కాంత్, ఎడిటర్ : శివ శర్వాణి, సహ నిర్మాత : సుబ్బా రాయుడు.
ఘనంగా ‘పోలీస్ వారి హెచ్చరిక’ ట్రైలర్ రిలీజ్
- Advertisement -
- Advertisement -