Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలురాయిచేడులో రాజకీయ మార్పులు..

రాయిచేడులో రాజకీయ మార్పులు..

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ప్రజల్లో విశ్వాసం పెంచుతున్న నేపథ్యంలో, శనివారం రాయిచేడు గ్రామంలో అనేకమంది నాయకులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మండల అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, మాజీ జెడ్పిటిసి అనంత ప్రతాపరెడ్డి, మాజీ ఎంపీపీ తిప్పర్తి అరుణ నరసింహారెడ్డి, మామిళ్ళపల్లి ఆలయ చైర్మన్ నరసింహరావు సమక్షంలో  కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నా బీజేపీ మండల ఉపాధ్యక్షుడు గొడుగు వెంకటేష్ యాదవ్, టీఆర్‌ఎస్‌ నుంచి నోముల సైదులు, తోళ్ల శ్రీను తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాయిచేడు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు తోళ్ల ఆనంద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లయ్య, కొర్ర బాలు, స్థానిక కార్యకర్తలు పాల్గొని కొత్తగా చేరిన నాయకులను సాదరంగా స్వాగతించారు. ప్రజాపాలనలో పారదర్శకత, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నమ్మకంతోనే ఈ చేరికలు జరిగాయని నాయకులు తెలిపారు. ఇది గ్రామస్థాయిలో కాంగ్రెస్ బలోపేతానికి ఊతమిచ్చే పరిణామంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad