Tuesday, March 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఏడు నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2,569 వార్డుల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల లోపల, బయట వెబ్‌కాస్టింగ్‌ చేసేందుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 16న కార్పొరేషన్ల మేయర్లు, ఉపమేయర్లు, మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్ల పదవులకు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -