- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఉపరాష్ట్రపతి ఎన్నికల పొలింగ్ లో ఇద్దరు ఎంపీలు క్రాస్ ఓటింగ్ వేశారు. ఆప్ పార్టీకి చెందిన స్వాతి మాలివాల్ ఆ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్డీయే కూటమి అభ్యర్థికి ఓటు వేశారు. అదే విధంగా ఆర్జేడీ ఎంపీ గిరిధర్ లాల్ యాదవ్ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. దీంతో పార్టీల నిర్ణయాన్ని ఆ ఎంపీలిద్దరూ ధిక్కరించారు. అయితే ఉపరాష్ట్రతి ఎన్నికలకు ముందు ఆప్ , ఆర్జేడీ ఇండియా బ్లాక్ కూటమి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డికి మద్దతు ప్రకటించాయి. కానీ ఇరువురు ఎంపీలు ఆయా పార్టీల నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్డీయే కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ కు క్రాస్ ఓటు వేశారు.
- Advertisement -