నవతెలంగాణ – పెద్దవూర
గ్రామాలకు వెళ్లే పోలింగ్ సామగ్రిని జాగ్రత్తగా పంపిణీ చేయాలని మండల ప్రత్యేక అధికారి రాజ్ కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రం లోని రాఘవేంద్ర ఫంక్షన్ హల్లో నేడు మండలంలో జరిగే రెండవ విడత పంచాయతి ఎన్నికల పోలింగ్ సామాగ్రీని పంపిణి పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఏచిన్న పొరపాటు జరగకుండా పీఓలు, ఓపీఓలకు సామగ్రిని అందించాలన్నారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిగేందుకు అన్ని అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు వెల్లడించారు. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు తమ పూర్తి సహకారం అందించాలన్నారు. 720 మంది పిఓ,ఓపిఓ లు 30 మంది మైక్రో అబ్జర్వర్లు వెబ్ కాస్టింగ్ వారు 28 మంది స్టేజ్ టూ ఆఫీసర్లు తదితరులు ఎన్నికలలో పాలుపంచుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ,ఉమాదేవి,తహసీల్దార్ శ్రీదేవి,ఎంపీఓ విజయ కుమార్,ఎంఈఓ తరిరాము,మాస్టర్ ట్రైనర్లు పాపిరెడ్డి,దేవేందర్, పంకజ్ రెడ్డి, పంచాయతీరాజ్ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



