Friday, September 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుత్వరలో 'పోంగులేటి' బయోపిక్

త్వరలో ‘పోంగులేటి’ బయోపిక్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా, ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవిత ప్రస్థానం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ఆయన జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతుండటం ప్రస్తుతం ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రంలో పొంగులేటి పాత్రను ప్రముఖ సీనియర్ నటుడు సుమన్ పోషించనున్నారు. ఈ సినిమాకు ‘శ్రీనన్న అందరివాడు’ అనే పేరును ఖరారు చేశారు. మంత్రి పొంగులేటి వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలతో పాటు, ఆయన రాజకీయ ప్రయాణాన్ని కూడా ఈ చిత్రంలో సమగ్రంగా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఒక సాధారణ స్థాయి నుంచి కీలక రాజకీయ నేతగా ఆయన ఎదిగిన తీరును ఈ చిత్రంలో ప్రధానంగా ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రానికి బయ్య వెంకట నర్సింహ రాజ్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -