Wednesday, November 26, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో ప‌డిపోయిన గాలినాణ్య‌త‌

ఢిల్లీలో ప‌డిపోయిన గాలినాణ్య‌త‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఢిల్లీలో గతకొన్నిరోజులుగా ‘వెరీ పూర్‌’ కేటగిరిలోనే గాలి నాణ్యతలు నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం దేశ రాజధాని ప్రాంతంలో ఎక్యూఐ స్థాయిలు 335 వద్ద నమోదయ్యాయి. దీంతో ఈ స్థాయిల్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెరీ పూర్‌ కేటగిరీగా వర్గీకరించింది. అయితే గాలి నాణ్యతలు తీవ్ర ప్రమాదకర స్థాయి నుంచి వెరీ పూర్‌ కేటగిరీకింద ఎక్యూఐ నమోదైంది. రాబోయే ఐదు రోజుల్లో కూడా ఎక్యూఐ స్థాయిలు చాలా పేలవంగానే నమోదవ్వొచ్చు అని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఈ పరిస్థితుల్లో బుధవారం ఢిల్లీలో 24 డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -