Tuesday, October 28, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఫుడ్‌ స్టాంపులకు అమెరికన్‌ పేదలు దూరం

ఫుడ్‌ స్టాంపులకు అమెరికన్‌ పేదలు దూరం

- Advertisement -

షట్‌ డౌన్‌తో తీవ్ర ప్రభావం
అమెరికాలో 8000 విమానాలు ఆలస్యం

వాషింగ్టన్‌ : అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్‌ కొనసాగుతుండడంతో ఫుడ్‌ స్టాంపులపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది అల్పాదాయ వర్గాల ప్రజలు నెలవారీ ఆర్థిక ప్రయోజనాలకు దూరమవు తున్నారు. ఫుడ్‌ స్టాంపులుగా పేరొందిన సప్లిమెంటల్‌ నూట్రిషన్‌ అసిస్టెన్స్‌ ప్రోగ్రాం (స్నాప్‌) ద్వారా అమెరికాలో 42 మిలియన్ల మంది నెలవారీగా ప్రభుత్వం నుంచి డబ్బు అందుకుంటున్నారు. షట్‌డౌన్‌ కొనసాగితే ఈ కార్యక్రమానికి నిధుల కొరత ఏర్పడుతుందని, నవంబ రులో డబ్బు అందించడం సాధ్యం కాదని వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ నెల 10వ తేదీన అన్ని రాష్ట్రాలకూ సమాచారం పంపింది. స్నాప్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తాయి. దీని కింద ప్రతి కుటుంబానికీ నెలకు 190 డాలర్లు లేదా 356 డాలర్లు అందజేస్తారు. ఈ సొమ్ముతో లబ్ది దారులు పండ్లు, కూర గాయలు, మాంసం, పాల ఉత్ప త్తులు, బ్రెడ్‌, ఇతర ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తారు. స్నాప్‌ ద్వారా ప్రయోజనం పొందుతున్న వారిలో చాలా మంది పేదలే. ఫుడ్‌ స్టాంపులు నవంబర్‌ 1వ తేదీ నుంచి కన్పించవని సామాజిక మాధ్య మాలు చెబుతున్నాయి. నవంబరులో అల్పాదాయ వర్గాలు, పేదలకు ఆర్థిక సాయం అందించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని వ్యవసాయ శాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాలకూ సూచించింది. షట్‌డౌన్‌ ఇలాగే కొనసాగితే లబ్దిదారులకు నవంబర్‌ నెల ప్రయోజనాలు అందబోవని పలు రాష్ట్రాల అధికారులు స్పష్టం చేశారు.

అమెరికాలో 8000 విమానాలు ఆలస్యం
అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్‌ ఎఫెక్ట్‌ విమాన సర్వీసులపై పడింది. అగ్రరాజ్య వ్యాప్తంగా ఆదివారం దాదాపు 8వేలకుపైగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. షట్‌డౌన్‌ కారణంగా చాలాచోట్ల ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బంది విధులకు గైర్హాజరవ డంతో వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన 22 ప్రాంతాల్లోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బంది కొరత ఏర్పడిందని అమెరికా రవాణా మంత్రి శాన్‌ డఫీ వెల్లడించారు. రానున్న రోజుల్లో సిబ్బంది కొరత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, దీంతో విమానాల ఆలస్యం, సర్వీసుల రద్దు మరింత పెరగొచ్చని పేర్కొన్నారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11 గంటల వరకు దాదాపు 8 వేలకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు ఫ్లైట్‌ అవేర్‌ వెబ్‌సైట్‌ వెల్లడించింది. సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌లో 45శాతం అంటే దాదాపు 2వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 1200, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 739, డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 600 విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది.

లాస్‌ ఏంజెలెస్‌ ఎయిర్‌పోర్టుకు విమానాలు నిలిపివేత..
అటు సిబ్బంది కొరత కారణంగా అమెరికాలో అత్యంత రద్దీ అయిన లాస్‌ ఏంజెలెస్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో కార్యక లాపాలకు ఆటంకం కలిగింది. ఈ ఎయిర్‌ పోర్టుకు వెళ్లే విమానాలను కొంత సేపు నిలిపివేశారు. దాదాపు రెండు గంటల పాటు ఈ ఎయిర్‌పోర్టుకు విమానాలు వెళ్లలేదు. వాషింగ్టన్‌, న్యూ జెర్సీ, న్యూఆర్క్‌ ప్రాంతాల్లోని విమానా శ్రయాల్లోనూ ఈ సమస్య నెలకొందని ఫెడరల్‌ ఏవి యేషన్‌ అధికారులు వెల్లడిం చారు.అక్టోబరు 1 నుంచి అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 13వేల మంది ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు, 50వేల మంది ట్రాన్స్‌పోర్ట్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు ఎలాంటి వేతనం లేకుండానే విధులు నిర్వర్తించాలనే ఆదేశాలున్నాయి. అయినప్పటికీ కొందరు ఏటీసీ సిబ్బంది విధులకు గైర్హాజరవడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -