కాటారం గ్రామ పంచాయతీ లో దోమలు
మండలంలో ఫాగింగ్ లేకపాయే
భారీగా పెరుగుతున్న సీజనల్ వ్యాధులు
ప్రజల గురించి పట్టించుకోని అధికారులు
రామిళ్ల కిరణ్ బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు
నవతెలంగాణ – కాటారం : కాటారం కేంద్రంలో ప్రజలు దోమల బెడతతో సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న అధికారులు మాత్రం మొద్దు నిద్ర పోతున్నారని రా మెల్ల కిరణ్ టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు తీవ్రస్థాయిలో విమర్శించారు .
మంగళవారం రోజున పాత్రికేయ సమావేశంలో రామిళ్ల కిరణ్ మాట్లాడుతూ పారిశుద్ధ్య లోపంతో విలవిలలాడుతుందని అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం విడ్డూరమని అన్నారు. పంచాయతీల అసమర్థత వల్ల పారిశుద్ద్య నిర్వహణ సక్రమంగా జరుగడం లేదు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో గ్రామాల్లో పిచ్చి మొక్కలు, కుంటల్లో నీరు నిల్వ ఉంటోంది. దీని వల్ల దోమల బెడద ఎక్కువవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని నివారించేందుకు గ్రామపంచాయతీలు చేస్తున్న కృషి అంతంత మాత్రంగానే ఉంది. ఫాగింగ్ మిషన్లు ఉన్నప్పటికీ వాడకుండా గ్రామ పంచాయతీ నుండి బయటకు తీయకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శి కాలం గడుపుతూ వస్తున్నాడని విమర్శించాడు . గ్రామంలో దోమల వ్యాప్తి విపరీతంగా పెరిగి ప్రజలు అనేక సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. గ్రామంలో ఫాగింగ్ చేయకపోవడం వల్ల దోమల వ్యాప్తి పెరుగుతోంది. దీనివల్ల ప్రజలు డెంగ్యూ,మలేరియా,ఐఫోడ్,వైరల్ జ్వరం వంటి రోగాల బారిన పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వర్షాకాలం నుండి అసలు ఫాగింగ్ చేసిన దాఖలాలు లేవని రామిళ్ల కిరణ్ ఆరోపిస్తున్నారు. అదేవిధంగా కనీసం వీధులలో బీజింగ్ పౌడర్ చల్లడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.కాబట్టి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో ఫాగింగ్,బీజింగ్ పౌడర్ చేయించాలని ఆయన కోరారు. లేనియెడల కాటారం అంబేద్కర్ సెంటర్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వారి వెంట మనం రాజబాబు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు
పడకేసిన పారిశుధ్యం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES