– యాజమాన్యంపై కేసు నమోదు
– చిన్నారిపై ఆయా దాడి ఘటనలో..
నవతెలంగాణ – కుత్బుల్లాపూర్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా షాపూర్‌నగర్‌లో నాలుగేండ్ల చిన్నారిపై ఓ ప్రయివేటు పాఠశాల ఆయా అమానుషంగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పూర్ణిమ స్కూల్‌లో జరిగిన ఈ దారుణంపై విద్యాశాఖ వెంటనే చర్యలకు ఉపక్రమించింది. స్కూల్‌ను సీజ్ చేసింది. పాప తండ్రితో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న ఆయా లక్ష్మి చిన్నారిని స్కూల్ ప్రాంగణానికి తీసుకెళ్లి దారుణంగా కొట్టింది. పాప కాళ్లపై నిలబడి కొట్టింది. ఈ ఘటనను స్కూల్ పక్క భవనం పై అంతస్తులో ఉన్న యువకుడు వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం బయటపడింది. పోలీసులు వెంటనే స్పందించి చిన్నారి కుటుంబాన్ని సంప్రదించారు. చిన్నారిని తల్లిదండ్రులతో కలిసి వెంటనే ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. బాలిక ప్రస్తుతం కోలుకుంటోంది. బాలానగర్ ఏసీపీ నరేశ్ రెడ్డి, జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేశ్ ఆస్పత్రిలో చిన్నారి ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఆయా లక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారిపై కూడా కేసు నమోదు చేశారు.సంఘటన గురించి వివరాలు తెలుసుకోవడానికి సోమవారం ఎంఈఓ జెమిలీ కుమారి స్కూల్‌కు వెళ్లి యాజమాన్యాన్ని విచారించారు. పసిపాపపై ఆయా చేసిన దాడిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. అలాగే మేడ్చల్-మల్కాజిగిరి డీఈవో విజయకుమారి, చైల్డ్ ప్రొటెక్షన్ కమిషనర్ సభ్యులు సరిత ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. వారి సూచనల మేరకు స్కూల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. పై అధికారుల ఆదేశాల మేరకు పూర్ణిమ స్కూల్‌ను సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు.
పూర్ణిమ స్కూల్ సీజ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



