నవతెలంగాణ-హైదరాబాద్ : జనాభా లెక్కలు, కులగణన ఎప్పటి నుంచి ప్రారంభించాలనే దానిపై కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడంతో అవసరమైన ఏర్పాట్లలో జనాభా లెక్కల అధికారులు నిమగ్నమయ్యారు. జనాభా లెక్కల్లో భాగంగా రాష్ట్ర స్థాయి నుంచి ఎన్యుమరేటర్ల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. అన్ని దశల్లో శిక్షణ ఇవ్వడానికి నేషనల్ ట్రైనర్స్, స్టేట్ ట్రైనర్స్, జిల్లా ట్రైనర్స్ ఉంటారు. వచ్చే ఆగస్టు నుంచి శిక్షణ ప్రారంభించాలని నిర్ణయించారు. అన్ని స్థాయిల్లో ట్రైనింగ్ పూర్తి కావడానికి కనీసం నాలుగైదు నెలలు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈసారి ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో సర్వే చేయనున్నందున అందరికీ రెండు అంశాలపై అవగాహన ఉండే విధంగా శిక్షణ ఇస్తారు. జనాభా లెక్కలకు ప్రత్యేకంగా కేంద్రానికి ఎలాంటి సిబ్బంది ఉండరు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులను ఉపయోగించుకొని సర్వే చేస్తారు. ప్రభుత్వ టీచర్లను ఎన్నికలు, జనాభా లెక్కలకు వినియోగించుకోవడానికి సుప్రీంకోర్టు సైతం అనుమతించింది. దీంతో రాష్ట్రంలోని టీచర్లను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటారు. ఇప్పటికే వారి వివరాలను సేకరించే పనిలో కేంద్రం నిమగ్నమైంది.
జనాభా లెక్కల అధికారుల హోదాలు
కలెక్టర్, ప్రిన్సిపల్
మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సెన్సెస్ ఆఫీసర్
అడిషనల్ కలెక్టర్, జాయింట్ ప్రిన్సిపల్
మున్సిపల్ కార్పొరేషన్ సెన్సెస్ ఆఫీసర్స్
జోనల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్
జిల్లా రెవెన్యూ అధికారి జిల్లా సెన్సెస్ ఆఫీసర్
చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ సెన్సెస్
జిల్లా విద్యాశాఖ అధికారి, ఆఫీసర్స్
జెడ్పీ సీఈవో, డీపీవో
జిల్లా అటవీశాఖ అధికారి
సబ్ కలెక్టర్, ఆర్డీవో సబ్ డివిజనల్ సెన్సెస్ ఆఫీసర్స్
మున్సిపల్ కార్పొరేషన్ సిటీ సెన్సెస్ ఆఫీసర్స్
డిప్యూటీ కమిషనర్లు
మున్సిపల్ కమిషనర్లు, టౌన్ సెన్సెస్ ఆఫీసర్స్
(స్సెషల్ చార్జ్స్)
మున్సిపాలిటీల్లోని అడిషనల్ టౌన్ సెన్సెస్
టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, ఆఫీసర్స్
టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్స్,
బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్
సీపీవో కార్యాలయ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ సెన్సెస్
స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ఆఫీసర్స్
తహశీల్దార్ సెన్సెస్చార్జ్ ఆఫీసర్
ఎంపీడీవో అడిషనల్ సెన్సెస్ చార్జ్ ఆఫీసర్
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, వార్డు సెన్సెస్ ఆఫీసర్స్
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్,
టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్స్,
రెవెన్యూ ఇన్ స్పెక్టర్స్,
ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్