Friday, November 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలువిద్యుత్ షాక్ తో హమాలి కార్మికుడు మృతి

విద్యుత్ షాక్ తో హమాలి కార్మికుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో అప్పాల ఐలయ్య(50) అనే హమాలి కార్మికుడు, రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని రుద్రారం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల, కుటుంబ సభ్యుల పూర్తి కథనం ప్రకారం ఐలయ్య ఉదయం 6 గంటలకే తన పొలానికి నీళ్లు వేయడానికి వెళ్లి జంపర్ వేయబోయి ప్రమాదవశాత్తు 11 కెవి విద్యుత్ తీగ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలిపారు. మృతుడు హమాలి కార్మికుడు పని చేస్తూ, ఇటు వ్యవసాయం చేస్తాడని తెలిపారు. ప్రభుత్వం, విద్యుత్ అధికారులు ఆర్థికంగా మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు వేడుకొన్నారు. సంఘటన స్థలం వద్దకు కొయ్యుర్ పోలీసులు చేరుకొని పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -