- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: లండన్‌లోని ప్రముఖ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సీటి లో ప్రఖ్యాత సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర పోరాట యోధుడు పెరియార్ రామస్వామి చిత్ర పటాన్ని తమిళనాడు సీఎం ఎకే స్టాలిన్ ఆవిష్కరించారు. ప్రపంచ జ్ఞానవంతుడు, విజ్ఞాన పితా చిత్రపటాన్ని ఆయన మనవడితో కలిసి ఆవిష్కరించడం ఎంతో అనందంగా ఉందని ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు. తమిళనాడులో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని సవాలు చేసి, బ్రాహ్మణేతర వర్గాలను చైతన్యపరించి 1925లో పెరియార్ ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించారని ముఖ్యమంత్రి ఒక పోస్ట్‌లో రాసుకొచ్చారు.ఆత్మగౌరవ ఉద్యమం మనుషుల మధ్య వ్యత్యాసాలు లేని సమాజాన్ని కోరుకుందని ఆయన కొనియాడారు.
- Advertisement -