Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోస్టల్ బ్యాలెట్, అత్యంత బాధ్యతాయుతమైన ప్రక్రియ: కలెక్టర్

పోస్టల్ బ్యాలెట్, అత్యంత బాధ్యతాయుతమైన ప్రక్రియ: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అత్యంత బాధ్యతాయుతమైన ప్రక్రియ అని, ఈ ప్రక్రియలో పాల్గొనే ప్రతి ఉద్యోగి  నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఎన్నికల సామాగ్రిని ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్యాలెట్ పంపిణీ, స్వీకరణ జరగాలని. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి  పేర్కొన్నారు..   మంగళవారం నల్లగొండ మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏర్పాట్లను కలెక్టర్  పరిశీలించారు. పోలింగ్ సామాగ్రి పంపిణీకి  అవసరమయ్యే ఏర్పాట్లను నల్లగొండ మండల కేంద్రంలోని ఇంద్రారెడ్డి ఫంక్షన్ హాల్ లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లను  పర్యవేక్షించారు. ప్రతి బండిల్‌పై సీల్, సంతకాలు వంటి అంశాలపై  ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.

ఎన్నికల సామగ్రి పంపిణీ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌంటర్లు  ఎన్నికల సామాగ్రి సరఫరా వ్యవస్థ, రిసెప్షన్ రూమ్  కార్యకలాపాలను పరిశీలించారు. సామగ్రి పంపిణీ సమయంలో  ప్రతి పోలింగ్ బృందానికి అవసరమైన సామాగ్రి సమయానికి అందించేందుకు ప్రత్యేక డెస్కులు ఏర్పాటు చేయాలన్నారు. బృందాలు వచ్చిన క్రమానుసారం రిజిస్ట్రేషన్ నుంచి మెటీరియల్ పంపిణీ వరకూ  మార్గదర్శకాలు పాటించాలన్నారు.ఎక్కడ ఆలసత్వం, అయోమయం తలెత్తకుండా తగిన సూచిక బోర్డులు, సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా భద్రత, సీసీ కెమెరా పర్యవేక్షణ, పోలింగ్ సిబ్బందికి త్రాగునీరు, విశ్రాంతి గదులు, వైద్య అత్యవసర సదుపాయాల లభ్యతపై  అడిగి తెలుసుకున్నారు.

కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు,  ఆర్టీవో అశోక్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి  శేఖర్ రెడ్డి, తహసిల్దార్. పరశురాం, ఎంపీడీవో యాకూబ్ నాయక్  లు  ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -