నవతెలంగాణ-మిర్యాలగూడ : గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఉద్యోగులు,ఉపాధ్యాయులు,పోలీసులు ఉపయోగించుకునే పోస్టల్ బ్యాలెట్లను రహస్యంగా ఉంచాలని, స్వస్తిక్ గుర్తుతో ఓటు వేయించి అన్ని ఓట్ల వలే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించాలని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరథ నాయక్ కోరారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ లను ప్రత్యేకంగా రైట్ టిక్ గుర్తు వేసి లెక్కించడం వల్ల గ్రామాలలో ఉద్యోగులు తమకు ఓటు వేయలేదని భావన అభ్యర్థులలో కలిగి మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. కావున పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కూడా స్వస్తి గుర్తుతో వేయించి ఓట్ల లెక్కింపు సందర్భంలో మొత్తం ఓట్లలో కలిపి లెక్కించాలని సూచించారు. తద్వారా ఉద్యోగుల ఓట్లు ప్రత్యేకంగా గుర్తించడానికి వీలు ఉండదని అన్నారు.ఈ విషయమై ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో బంజారా ఉద్యోగుల సంఘం నాయకులు మక్లా నాయక్, దాశివ,శ్రీను నాయక్,రమేష్ నాయక్, సైద నాయక్,తదితరులు పాల్గొన్నారు
పోస్టల్ బ్యాలెట్లు రహస్యంగా వుంచాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



