Wednesday, August 6, 2025
E-PAPER
Homeకరీంనగర్కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో పెట్టాలని పోస్ట్ కార్డు ఉద్యమం 

కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో పెట్టాలని పోస్ట్ కార్డు ఉద్యమం 

- Advertisement -
  • – డాక్టర్ జేరిపోతుల పరుశురాం
    నవతెలంగాణ – ధర్మారం 
  • దేశకరెన్సీపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని కోరుతూ.. మండల కేంద్రంలో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టామనీ కరెన్సీ పై డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతి అధ్యక్షులు డాక్టర్ జైరిపోతుల పర్శరాం అన్నారు. మండల కేంద్రంలో బుధవారం రోజు అంబేద్కర్ చౌరస్తా వద్ద పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ జెండా రూపకల్పన కమిటీ ఏర్పడిన జూన్ 23 నుండి 2026 జనవరి 26 వరకు పోస్టు కార్డులు ఉద్యమం చేపట్టామని లక్ష మందితో పోస్ట్ కార్డులు పంపిస్తామని ఈ అంశం పార్లమెంటులో ప్రస్తావించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఐ పార్టీ జాతీయ అధ్యక్షులు జాన్, కరెన్సీ పై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర ఫోటో సాధన కమిటీ ఉపాధ్యక్షులు బొల్లి స్వామి, సభ్యులు చంద్రహాస్, బి సంపత్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -