Wednesday, July 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు 

మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు 

- Advertisement -

మండలంలో “ఆత్మరక్షణ ప్రజా ఫ్రంట్ తెలంగాణ” పేరుతో విడుదల 
నవతెలంగాణ – తాడ్వాయి 

ములుగు జిల్లాలో మావోయిస్టు వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు. నక్సల్స్ చలనంపై మరోసారి చర్చ మొదలైంది. తాడ్వాయి మండలంలో “ఆత్మరక్షణ ప్రజా ఫ్రంట్- తెలంగాణ”పేరుతో వాల్ పోస్టర్లు వెలిశాయి. సోమవారం మండలంలో ఈ పోస్టర్లను అంటించారు. గత రెండు రోజుల క్రితం సరిహద్దు మండలాలైన వెంకటాపురం, వాజేడు, మంగపేట, గోవిందరావుపేట మండలాల సరిహద్దుల గ్రామాల్లో గుత్తి గుడాలలో వెలిశాయి. సోమవారం తాడ్వాయి మండలంలో కలకలం రేపాయి.

ఈ పోస్టరు మావోయిస్టు అగ్ర నాయకత్వాన్ని ఉద్దేశిస్తూ ప్రస్తావించిన సందేశం నూతనంగా ఆత్మ విమర్శనాత్మకంగా ఉండటం గమనార్హం. పోస్టర్లలో సిద్ధాంతం కోసం అడవి పాలైన అన్నల్లారా, అక్కల్లారా అంటూ ప్రారంభమవుతూ, 40 ఏళ్లుగా మావోయిస్టు నమ్మిన సిద్ధాంతం సామాన్య ప్రజలకు ఎప్పుడైనా ఆశా కిరణంగా మారిందా అనే ప్రశ్నను లేవనెత్తారు. కాలంతో, ప్రజల ఆలోచనలతో కలిసి మారని ఉద్యమాలు ఎలా ప్రజల మద్దతును కోల్పోతాయో, ఒకప్పుడు గేయంగా భావించిన మార్గాలు ఎలా జనాభావాలను దూరం చేసుకున్నాయో ఈ సందేశం హృద్యంగా వివరించింది. అసంతృప్తిలేని ఆత్మగౌరవంతో ముందుకు పోతున్న ఉద్యమ బాట మూడు వారిన బీడులా మారిందని ఉద్యమ వైఫల్యాన్ని పరోక్షంగా గుర్తించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -