నవతెలంగాణ హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్షాలు కొనసాగే అవకాశముండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ, పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సమన్వయంలో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
– లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
– ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్ అంతరాయాలు లేకుండా చర్యలు చేపట్టాలి.
– హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి.
– రానున్న రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశముంది.
– వర్షాలు, వరదలతో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలి.
– ప్రజలకు ఎలాంటి అవసరమైనా అందించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలి.