Thursday, October 30, 2025
E-PAPER
Homeనిజామాబాద్ఓయూ డాక్టరేట్ పొందిన పోతన్న

ఓయూ డాక్టరేట్ పొందిన పోతన్న

- Advertisement -

నవతెలంగాణ నిజామాబాద్ సిటీ 

నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రానికి చెందిన ఇస్సపల్లి పోతన్నకి ఓయూ చరిత్ర విభాగం డాక్టరేట్ ప్రకటించింది. మధ్యయుగ దక్కన్ పాలకులు – సైనిక వ్యవస్థ (1000-1724) అన్న అంశంపై పోతన్న పరిశోధన చేయగా చరిత్ర విభాగం డాక్టరేట్ ను ప్రకటించింది. ప్రొ.జి.అంజయ్య గైడ్ గా వ్యవహరించారు. ప్రస్తుతం పోతన్న తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. రైతు కుటుంబంలో జన్మించిన పోతన్న ప్రాథమిక విద్య ఆలూరులో, డిగ్రీ నిజామాబాద్ గిరిరాజ్ కాలేజీ లో, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పి.హెచ్. డి.ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పూర్తి చేశారు. పోతన్న తన విద్యాభ్యాసం పూర్తిగా ప్రభుత్వ బడులలోనే చదివి డాక్టరేట్ సంపాదించారు. డాక్టరేట్ రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తన అభివృద్ధిలో భాగస్వామి అయిన తన తల్లి తండ్రులకు, గురువులకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -