నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం దూపల్లి రోడ్డుపై వెళ్లే వాహనదారులకు నరకాన్ని తలపిస్తోందని వాహనదారులు వాపోతున్నారు. దండిగుట్ట నుంచి దూపల్లి గేటు వరకు ఉన్న రోడ్డు గుంతల మయమై నరకాన్ని తలపిస్తుంది. ఈ రోడ్డుపై వెళ్లడానికి వాహనదారులు నానా అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుందనీ, రోడ్డు భవనాల శాఖ అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమత్తులకు శ్రీకారం చుట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఈ రోడ్డుపై వెళ్లడానికి వాహనదారులు ముందుకు రావడం లేదు. నవీపేట్ మీదుగా జాన్కంపేట్ ద్వారా వాహనదారులు వెళ్లాల్సి వస్తుంది. రెండు కిలోమీటర్లు దూరమైనప్పటికీ వారు ఈ రోడ్డు మార్గం ద్వారా వెళ్లడానికి ఇష్టపడడం లేదు. ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మత్తులకు చేయించాలని వారు కోరుతున్నారు.
గుంతలమయంగా రోడ్డు.. పట్టించుకోని అధికారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES