Saturday, November 15, 2025
E-PAPER
Homeజాతీయంసంపద సృష్టితోనే పేదరిక నిర్మూలన

సంపద సృష్టితోనే పేదరిక నిర్మూలన

- Advertisement -

ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌
దేశానికి గేట్‌వేలా విశాఖ : ఏపీ సీఎం చంద్రబాబు
ఉత్సాహంగా ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య సదస్సు

విశాఖపట్నం : సంపదను సృష్టిస్తేనే పేదరికాన్ని నిర్మూలిరచడం సాధ్యమవుతురదని భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ అన్నారు. విశాఖపట్నంలో శుక్రవారం ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వివిధ దేశాల నుంచి వచ్చిన పలు సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రధానిమోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయమై ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేస్తున్నా యని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలు, మౌలిక వసతుల కల్పన, వివిధ రంగాల్లో పెట్టుబడులు వంటి అరశాల్లో కృషి జరుగుతోందన్నారు.

ఈ-గవర్నెన్స్‌, డిజిటల్‌ ఇన్‌ప్రా ద్వారా వేగంగా సేవలు అందుతున్నాయని చెప్పారు. దేశంతోపాటు, రాష్ట్రంలోనూ పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయమన్నారు. అభివృద్ధికి చంద్రబాబు రోల్‌మోడల్‌గా నిలుస్తున్నారని ప్రశంసించారు. రానున్న రెరడు మూడేండ్లలో భారత్‌ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ విశాఖపట్నం దేశానికి గేట్‌వేలాగా మారుతోందని చెప్పారు. ఇటీవలే విశాఖను కేంద్ర ప్రభుత్వం సురక్షితమైన నగరంగా ప్రకటించిందని తెలిపారు. పెట్టుబడిదారుల లక్ష్యంగా రాష్ట్రం ఎదుగుతోందని, రాష్ట్రంలో విశాఖ పెట్టుబడులకు కేంద్రంగా నిలుస్తోందని అన్నారు. పారిశ్రామిక వేత్తల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇస్తోరదని, దీనికోసం ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాలను ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఈ ప్రోత్సాహకాలకు సావరీన్‌ గ్యారంటీ కూడా ఇస్తామన్నారు.

ఈ పెట్టుబడుల సదస్సుకు 72 దేశాల నుంచి 500 మంది విదేశీ ప్రతినిధులు వచ్చారని తెలిపారు. 2,500 మంది పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు కూడా సదస్సుకు వచ్చినట్టు చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ఏరోస్పేస్‌, డ్రోన్‌, ఎలక్ట్రానిక్‌, సెమీ కండకర్లు, డిఫెన్స్‌ వంటి రంగాల్లో అనేక పరిశ్రమలు ఏర్పాటుచేసేరదుకు ప్రోత్సాహాన్ని అరదిస్తున్నట్లు, త్వరలో డ్రోన్‌ టాక్సీలను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. గ్రీన్‌ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. పర్యాటకాన్ని ఒక ఇజంగా మారుస్తున్నామని, ఈ రంగంలో పెట్టుబడులు గణనీయంగా రావాల్సి ఉరటురదని తెలిపారు. 17 నెలల కాలంలోనే 20 బిలయన్‌ డాలర్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, దీనివల్ల 20 లక్షల మందికి ఉద్యోగాలు కూడా లభిస్తాయన్నారు. వచ్చే పదేండ్ల కాలంలో ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వస్తాయన్న నమ్మకంగా ఉన్నట్టు చెప్పారు.

పెట్టుబడుల కోసం పారదర్శక విధానం : కేంద్ర మంత్రి పీయూశ్‌ గోయల్‌
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్‌ గోయల్‌ మాట్లాడుతూ గ్లోబల్‌ ట్రేడ్‌ గేట్‌వేగా విశాఖను అభివర్ణించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం అత్యంత పారదర్శక విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. భారత్‌ తీసుకువచ్చిన డిజిటల్‌ పేమెరట్‌ విధానాన్ని ఇప్పుడు ప్రపంచం మొత్తం అనుసరిస్తోరదన్నారు. 30 మిలియన్‌ డాలర్ల విలువైన పెట్టుబడులతో సెమీ కండక్టర్‌ పరిశ్రమలు ఏర్పాటుచేస్తున్నామని, 500 గిగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశిరచుకున్నట్టు వివరిరచారు. స్వేచ్ఛా వాణిజ్యం కోసర వివిధ దేశాలతో వాణిజ్య బంధాలను బలోపేతం చేసుకురటున్నట్టు వివరిరచారు.

రాష్ట్రంలో ఎనిమిదోసారి జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కావాలని ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆకాంక్షిరచారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని కేంద్ర మరత్రులు కిరజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయన్నారు. కొన్ని నెలలుగా రాష్ట్రంలో మౌళికాభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయని వ్యాఖ్యానిరచారు. రాష్ట్రంలో విమానాశ్రయాలు అరతర్జాతీయ ప్రమాణాలతో సాగుతున్నాయని, ప్రస్తుతం ఏడు ఆపరేషనల్‌ ఎయిర్‌పోర్టులు ఉరటే కొత్తగా మరో ఏడు విమానాశ్రయాలు నిర్మిరచేరదుకు చర్యలు తీసుకురటున్నామని రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఏరో స్పేస్‌, ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ కేంద్రాలను కూడా రాష్ట్రానికి తీసుకువస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత రాధాకృష్ణన్‌ను రాష్ట్రపతిగా పేర్కొన్నారు. అయితే తరువాత సరిదిద్దుకుని ఉప రాష్ట్రపతిగా సంబోధించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -