భారీ బడ్జెట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే హోంబలే ఫిల్మ్స్ సంస్థ క్లీమ్ ప్రొడక్షన్స్‌తో సంయుక్తంగా మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఇది విష్ణు దశావతారాలను గొప్ప స్టొరీ టెల్లింగ్‌తో అత్యద్భుతమైన విజువల్ ట్రీట్‌మెంట్‌తో ఉండనుంది.
ఇందులో మొదటి అడుగు ‘మహావతార్ నరసింహ’ రూపంలో జూలై 25న త్రీడీ ఫార్మాట్‌లో, భారతదేశంలోని ఐదు ప్రధాన భాషలలో విడుదల కానుంది. ఈ చిత్రానికి దర్శకుడు అశ్విన్ కుమార్. నిర్మాతలు శిల్పా ధవాన్, కుశల్ దేశాయి, చైతన్య దేశాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ వైరల్‌గా మారి మేకర్స్ విజన్‌పై అంచనాలను పెంచింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘రోర్ అఫ్ నరసింహ’ను విడుదల చేశారు. సామ్ సి.ఎస్ ఈ పాటను డివైన్ వైబ్స్‌తో పవర్‌ఫుల్‌గా కంపోజ్ చేశారు. సామ్ సి.ఎస్, రాకేందు మౌళి సాహిత్యాన్ని అందించడమే కాక, అంతే ఎనర్జీటిక్‌గా పాడారు.
మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ భాగంగా 2025లో నరసింహ, 2027లో పరశురామ, 2029లో రఘునందన్, 2031లో ద్వారకాధీశ్, 2033లో గోకులానంద, 2035లో మహావతార్ కల్కి – పార్ట్ 1, 2037లో మహావతార్ కల్కి – పార్ట్ 2 చిత్రాల రూపంలో విష్ణు దశావతారాలను 12 సంవత్సరాల పాటు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
పవర్‌ఫుల్ ‘మహావతార్ నరసింహ’
- Advertisement -
- Advertisement -