Thursday, September 18, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకాళేశ్వరంపై పీపీటీకి అవకాశమివ్వాలి

కాళేశ్వరంపై పీపీటీకి అవకాశమివ్వాలి

- Advertisement -

అసెంబ్లీ స్పీకర్‌, కార్యదర్శికి బీఆర్‌ఎస్‌ నేతల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌, బీజేపీ దుష్ర్రచారం చేయడం తగదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరంపై ప్రజలకు నిజం చెప్పేందుకు తమకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కు అవకాశమివ్వాలని సభాపతిని సమయం కోరగా ఇవ్వలేదనీ, అసెంబ్లీ కార్యదర్శి తీసుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో కరువు పారద్రోలిన ప్రాజెక్టు కాళేశ్వరం అని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందని చెప్పారు. రెండు పిల్లర్లు కుంగితే ఏదో జరిగినట్టు మాట్లాడటం తగదని హితవు పలికారు. జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదికను తప్పుపడుతున్నామనీ, ఈ మేరకు న్యాయపోరాటం చేస్తున్నట్టు తెలిపారు. ప్రజల కోసం అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చేందుకు అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కె.పి.వివేకానంద, సుధీర్‌ రెడ్డి, ముఠా గోపాల్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -