Sunday, December 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఇప్పటివరకూ చూడని సరికొత్త క్లైమాక్స్ చూస్తారు : ప్రభాస్‌

ఇప్పటివరకూ చూడని సరికొత్త క్లైమాక్స్ చూస్తారు : ప్రభాస్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : 15ఏళ్ల తర్వాత ‘రాజాసాబ్‌’లాంటి ఎంటర్‌టైనర్‌తో వస్తున్నానని, ప్రతి ప్రేక్షకుడిని ఈ చిత్రం అలరిస్తుందని అన్నారు ప్రభాస్‌. ఆయన కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందిన హారర్‌ థ్రిల్లర్‌ ‘ది రాజాసాబ్‌’. మాళవిక మోహనన్‌, రిద్ది కుమార్‌, నిధి అగర్వాల్‌ కథానాయికలు. తమన్‌ సంగీతం అందించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్‌ వేడుక జరిగింది.

ఈ సందర్భంగా ప్రభాస్‌ మాట్లాడారు..‘హారర్‌ జానర్‌లో ఇప్పటివరకూ ఎవరూ చూడని సరికొత్త కథాంశంతో ‘ది రాజాసాబ్’ వస్తోంది. సంజయ్‌ దత్‌ ఫ్రేమ్‌లో ఉంటే మొత్తం ఆయనే డామినేట్‌ చేస్తారు. ఇది నానమ్మ- మనవడి కథ. రిద్ది, మాళవిక, నిధి అగర్వాల్‌ చాలా కష్టపడి పనిచేశారు. ఈ సినిమాకు అసలైన హీరో నిర్మాత విశ్వ ప్రసాద్‌. మొదట అనుకున్న బడ్జెట్‌ వేరు. మూడేళ్ల పాటు ఈ మూవీ సాగింది. బడ్జెట్‌ విషయంలో కొన్నిసార్లు మేము భయపడ్డాం కానీ, విశ్వప్రసాద్‌గారు అస్సలు భయపడలేదు. ఇలాంటి కథకు తమన్‌లాంటి వ్యక్తి మాత్రమే సరైన ఆర్‌ఆర్‌ ఇవ్వగలడు. ఇది దర్శకుడు మారుతి మూడేళ్ల ఒత్తిడి, బాధ్యత. నా సినిమాలన్నీ యాక్షన్‌ జానర్‌ అయిపోతున్నాయని మారుతితో అంటే, ఇదిగో హారర్‌ కామెడీని మీకోసం సిద్ధం చేశారు. కథ క్లైమాక్స్‌కు వచ్చేసరికి మారుతి రైటింగ్‌కు ఫిదా అయిపోయా. ‘డార్లింగ్‌ ఈ మూవీ క్లైమాక్స్‌ పెన్‌తో రాశావా మెషీన్‌ గన్‌తో రాశావా’ ఇప్పటివరకూ చూడని సరికొత్త క్లైమాక్స్ చూస్తారు. సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ హిట్‌ కావాలి’’ అని ప్రభాస్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -