నవతెలంగాణ – మల్హర్ రావు
వినియోగదారులకు అంతరాయం లేని నిరంతర విద్యుత్ సరఫరా చేయడంతో పాటు విద్యుత్ వినియోగంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కాటారం ఏడీఈ రమేశ్, మండల ఇన్చార్జ్ ఏఈ శేఖర్ అన్నారు. గురువారం మండలంలో వళ్లెంకుంట గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ బొమ్మ రజిత అధ్యక్షన విద్యుత్ అధికారులు ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్ సమస్యలు ఎదురైతే వినియోగ దారులు సంబంధిత అధికారులను, ఉద్యోగులను సంప్రదించడం, ఫిర్యాదులు చేయడం వంటి అంశాలపై గ్రామస్తులకు అవగాహ కల్పించారు. విద్యుత్ బిల్లుల ఆన్లైన్ చెల్లింపు పద్ధతులు,విద్యుత్ వినియోగంపై రైతులు తీసకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ఫిర్యాదు చేసే విధానం, సోలార్ విద్యుత్ ఏర్పాటు, రాయితీల వంటి వా టిపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వప్న,లైన్ మెన్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
మెరుగైన విద్యుత్ సరఫరాకు ‘ప్రజాబాట’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



