- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళి నవంబర్ 25న అమలులోకి వచ్చినందున ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి, అలాగే ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి గ్రీవెన్స్ లు తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు బుధవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు గమనించి ఎన్నికల నియమావళి పూర్తి అయ్యే వరకు సోమవారం, గురువారం ఫిర్యాదులు ఇచ్చేందుకు కలెక్టరేట్ కు రావద్దని ఆయన సూచించారు.
- Advertisement -


