నవతెలంగాణ – కాటారం
ఈ నెల 17వ తేదీన జరగనున్ని గ్రామ పంచాయతీ 3వ విడత ఎన్నికల ప్రచారం లో భాగంగా ఆదివారం కాటారం మండలం ధన్వాడ గ్రామంలో అభ్యర్థి చీటూరి మహేష్ గెలుపుకోసం గ్రామంలో వాడ వాడ తిరుగుతూ ఉంగరం గుర్తుకి ఓటు వేయాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ…రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారి స్వంత గ్రామం ధన్వాడ లో సర్పంచ్ ఎన్నికల్లో చిటూరి మహేష్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు శ్రీను బాబు బలపరిచారు. కొందరు ప్రతిపక్ష నాయకులు ధన్వాడ గ్రామ ప్రజలను అయోమయంలో పడేయడానికి మంత్రి శ్రీధర్ బాబు గారి మద్దతు తనకే ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గ్రామ ప్రజలు గమనించి గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్న పార్టీకి ఎన్నంటు ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తి చిటూరి మహేష్ గౌడ్ గారిని సర్పంచ్ గా గెలిపించుకోవాలని కోరారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రకాష్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు బట్టు కరుణాకర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



