- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ 51 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. పాఠ్యపుస్తకాలు రాసిన గణిత శాస్త్రజ్ఞుడు, రిటైర్డ్ పోలీసు అధికారి, వైద్యుడు, మాజీ అధికారులు ఈ జాబితాలో ఉన్నారు. అవినీతిపై గళమెత్తిన ప్రశాంత్ కిషోర్, క్లీన్ ఇమేజ్ ఉన్న అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించారు. తొలి జాబితా అభ్యర్థుల్లో 17 శాతం బీసీలు, 16 శాతం ముస్లిం అభ్యర్థులున్నారు.
- Advertisement -