- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వేల్పూర్ మండల మోతె గ్రామంలో సోమవారం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల చిరంజీవులు మాతృమూర్తి తోగర్ల మల్లుభాయి నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రశాంత్ రెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులును, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా మాతృమూర్తి మల్లుభాయి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళి అర్పించారు. ఆయన వెంట స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
- Advertisement -



