Thursday, August 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపేద పిల్లల భవిష్యత్‌కు ప్రతిభా పురస్కారాలు దోహదం

పేద పిల్లల భవిష్యత్‌కు ప్రతిభా పురస్కారాలు దోహదం

- Advertisement -

తెలంగాణ బాలోత్సవం రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.సోమయ్య
నవతెలంగాణ – ముషీరాబాద్‌

ప్రతిభా పురస్కారాలు పేద, బడుగు-బలహీన వర్గాల పిల్లల భవిష్యత్‌ను మెరుగుపరచడానికి తోడ్పడతాయని తెలంగాణ బాలోత్సవం రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.సోమయ్య తెలిపారు. తెలంగాణ బాలోత్సవం” ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో 7,8,9 తరగతుల్లో మెరిట్‌ సాధించిన విద్యార్థులకు ”ప్రతిభ గల పిడుగులకు – ప్రతిభా పురస్కారాలు” ప్రదానోత్సవ కార్యక్రమం ఈనెల 12న హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలకు సంబంధించి తెలంగాణ బాలోత్సవం నుంచి ఇప్పటికే ప్రతి స్కూల్లోనూ అప్పీల్‌ లెటర్‌ ఇచ్చి వివరించినట్టు తెలిపారు. దాదాపు 100కు పైగా పాఠశాలల నుంచి ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల పేర్లు పంపించారన్నారు. దాదాపు వెయ్యి మంది విద్యార్థులు ఈ సత్కారానికి అర్హులవుతున్నారని, వీరందరికీ సర్టిఫికెట్లు, మెమెంటోలు అందించనున్నట్టు వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, బడుగు-బలహీన వర్గాల పిల్లల భవిష్యత్‌ను మెరుగుపరిచేందుకు, ప్రోత్సహించడానికి, వారిలోని ప్రతిభను వెలికితీయడానికి ఉపయోగపడతాయని తెలిపారు. ఇంకా మిగిలిన పాఠశాలలు కూడా వెంటనే విద్యార్థుల పేర్లు, క్లాసు, వారి మెరిట్‌ మార్కులతో లిస్ట్‌ వాట్సప్‌ నెం.9490098676కు మెసేజ్‌ చేయాలని కోరారు. పాటలు, గేయాలు, ఏకపాత్రాభినయాలు, నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. బాలికల అభివృద్ధి, వారి ఆరోగ్యం, మానసిక ఒత్తిడి, ఉన్నత విద్య, ఉద్యోగాలపై ప్రత్యేక అవగాహన పెంచేందుకు తెలంగాణ బాలోత్సవం ఆధ్వర్యంలో పాఠశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బాలోత్సవం రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు సుజావతి, మమత, మహేష్‌ దుర్గే పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -