Tuesday, August 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉద్యోగులకు పీఆర్సీని వెంటనే ప్రకటించాలి 

ఉద్యోగులకు పీఆర్సీని వెంటనే ప్రకటించాలి 

- Advertisement -

– పెండింగ్ బిల్లులను చెల్లించాలి 
– యు.ఎస్.పి.సి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు సిహెచ్ అనిల్ కుమార్
నవతెలంగాణ – కామారెడ్డి

ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పి ఆర్ సి నీ వెంటనే ప్రకటించాలనీ, పెండింగ్ బిల్లులను చెల్లించాలనీ యు.ఎస్.పి.సి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు ( టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ) సిహెచ్ అనిల్ కుమార్ అన్నారు. ఉపాధ్యాయ సంఘాల పోరాటకమిటీ యూఎస్పిసి జిల్లాస్థాయి కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ వద్ద నిర్వహించిన ధర్నాలో  పాల్గొన్న ఆయన మాట్లాడుతూ .. ప్రభుత్వము విద్యారంగా పరిరక్షణ ద్యేయంగా ప్రభుత్వం పని చేయక పోవడం, ప్రభుత్వాలు మారిన విద్యా , ఉపాధ్యాయుల పరిస్థితులు మరకపోవడం  బాధాకరమని  అన్నారు. ధర్నా శిబిరాన్ని ప్రారంభిస్తూ ప్రభుత్వ పాఠశాలల పట్ల విద్యారంగం పట్ల ఉపాధ్యాయుల పట్ల సమస్యలు పరిష్కారానికి కృషి చేయకపోవడం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక వైఖరిని ఖండిస్తున్నామన్నారు. 

2023 నాటికి  పిఆర్సి గడువు ముగిసినా ప్రకటించి రెండు సంవత్సరాలు అవుతున్న ప్రభుత్వం పిఆర్సి అమలుకు ముందుకు రాకపోవడం బాధ్యతరాహిత్యం అని అన్నారు.  ఉద్యోగ విరమణ చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకపోవడం బాధాకరమని,  కేఎల్ పదోన్నతులలో సీనియార్టీ పద్ధతిలో ఉపాధ్యాయులను 40 శాతం కోటాను పునరుద్ధరించాలని అంటూ ఇవి వ్యక్తిగత డిమాండ్లు కావని విద్యారంగా సమస్య లేనని పేర్కొన్నారు.

ఈ ధర్నా లో యూపీఎస్సీ  జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు,  టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుల బాబు, టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు లింగం,  డి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు దేవుల,  ఎస్ సి ఎస్ టి యు ఎస్ జి హెచ్ ఏ అధ్యక్షులు నరేందర్, తెలంగాణ అంబెడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు గంగారాం, బహుజన సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ క్యాతం సిద్దరములు, సిపిఎం జిల్లా కార్యదర్శి కె చంద్ర షేకర్, సిపిఎం నాయకులు వెంకట్ గౌడ్, ఎస్ ఎఫ్ ఐ అరుణ్, బి వి యం  రాష్ట్ర నాయకులు విట్ఠల్, బి డి ఎస్ ఫ్ రాష్ట్ర నాయకులు ఆజాద్, పెన్షనర్స్ అసోసియేషన్ తదితర సంఘాల పార్టీల నాయకులు సాయిలు, ప్రభాకర్, లక్ష్మి, వాసు, వెంకట్ రెడ్డి, నారాయణ, విజయరామరాజు, రిటైర్డ్ హెచ్ఎం శ్రీనివాస్, రాజలింగం, ఎన్ నారాయణ, బాలయ్య, నాంపల్లి, మీనా భూషణ్, వినోద్, లక్ష్మయ్య, సరోజిని, గఫూర్, బాబురావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -