- Advertisement -
- – ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవకతవకలపై నిరసనకు సిద్ధమైన బీఆర్ఎస్ శ్రేణులు
– నియోజకవర్గంలో పర్యటించనున్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క.. - – ముందస్తు చర్యగా బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్
నవతెలంగాణ -తాడ్వాయి - కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఏజెన్సీలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి తరలి వెళ్తున్న క్రమంలో అక్రమంగా అరెస్ట్ చేసి మేడారం పోలీస్ స్టేషన్, తాడ్వాయి పోలీస్ స్టేషన్ లలో ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. తాడ్వాయి మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దండుగుల మల్లయ్య, మేడారం సర్పంచ్ చిడెం బాబురావు, నార్లాపూర్ సీనియర్ నాయకులు సిద్దబోయిన శివరాజ్, నార్లాపూర్ ఎంపీటీసీ కుక్కల శ్రీనివాస్, జిల్లా నాయకులు గోపన బోయిన కొమురయ్య, జీడి బాబురావు, పత్తి గోపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ అజ్మీర రతన్ సింగ్, మేడారం గ్రామ కమిటీ అధ్యక్షులు గజ్జల సమ్మయ్య, ఎడవెల్లి మధుసూదన్ రెడ్డి, గోపాలపురం సతీష్ చారి.. తాడ్వాయి పోలీస్ స్టేషన్లో మాజీ ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, మాజీ మండల అధ్యక్షుడు నూశెట్టి సరితరమేశ్, ప్రధాన కార్యదర్శి పోగు నాగేష్, మాజీ సర్పంచ్ లు పుల్లూరి గౌరమ్మ, జాజ చంద్రం, మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కొర్నేబెల్లి శివయ్య, మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ (వహీద్) ఉప సర్పంచ్ ఆలేట్ ఇంద్రారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలను తాడ్వాయి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్దంగా ఎవరికి ఆటంకం లేకుండా నిరసన తెలిపే శాంతియుత నిరసన కార్యక్రమానికి పోలీసులు అరెస్టు చేయడం ఇది హేయమైన చర్య అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎందుకింత భయం ప్రజల పక్షాన ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం ఏంటి అని వారు ప్రశ్నించారు? మనం ఎక్కడ ఉన్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అని మండిపడ్డారు.

- Advertisement -