Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలి: సీడీపీఓ

గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలి: సీడీపీఓ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా మంగళవారం డోంగ్లి మండల కేంద్రంలో మండల పరిధిలోని అన్ని అంగన్వాడి టీచర్ల ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పోషణ మాసం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ  కళావతి రాథోడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ.. ఆరోగ్యకరంగా ఉండాలంటే పోషణకు సంబంధించిన అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ కు సంబంధించిన ఫుడ్డు ప్రతి ఒక్కరు తీసుకోవాలని గర్భిణీ, బాలింతలు, పిల్లలు సూచించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అన్నప్రాసన, అక్షరాభ్యాసం, శ్రీమంతం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయుష్ మెడికల్ ఆఫీసర్  ప్రసన్న, సూపర్వైజర్లు దేవకరణ, కవిత, హెల్త్ సూపర్వైజర్ యాదమ్మ, ఏఎన్ఎం శోభ, ఆశ వర్కర్ ధ్రుపత, గర్భిణీలు బాలింతలు, కిశోర బాలికలు మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్లు పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -