నవతెలంగాణ-భీంగల్: 108 అంబులెన్స్‌లో ఓ మహిళ శిశువుకు జన్మించిన ఘటన శనివారం భీంగల్ మండలంలో చోటుచేసుకుంది. రహత్ నగర్ గ్రామానికి చెందిన సిరికొండ శిరీష(32)కు..పురిటి నొప్పులతో బాధపడుతుండగా..కుటుంబసభ్యులు..108 అంబులెన్స్ సిబ్బందికి ఫోన్ చేశారు. దీంతో తక్షణమే సంఘటన స్థలానికి చేరుకొని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో సదరు మహిళ అంబులెన్స్‌లోనే ఆడ శిశువుకు జన్మించింది. ఇద్దరు సురక్షితంగా ఉన్నారని, మెరుగైన చికిత్స కోసం ఆర్మూర్ ఏరియా దవాఖానుకు తరలించామని అధికారులు తెలిపారు. అత్యవసర సమయంలో చాకచాక్యంగా వ్యవహరించి..తల్లిబిడ్డల ప్రాణాలను కాపాడిన అంబులెన్స్ సిబ్బందిని బాధిత కుటుంబసభ్యులు మెచ్చకున్నారు.
108 అంబులెన్స్‌లో గర్భీణీ ప్రసవం..తల్లి బిడ్డ సురక్షితం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES