నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
108 సిబ్బంది సమయస్ఫూర్తి స్పందించడంతో గర్భిణీ మహిళకు అంబులెన్స్ లో సుఖ ప్రసవం నిర్వహించారు. ఈ నేపధ్యంలో చౌటుప్పల్ మండలం మల్కాపూరం గ్రామం మీనాక్షికి పురిటి నొప్పులు రావడంతో 108 సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన 108 సిబ్బంది పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీని చౌటుప్పల్ సామాజిక ఆరోగ్య కేంద్రంకు మల్కాపురం నుంచి తీసుకొస్తున్న సమయంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో కాన్పు చేయాలని గమనించిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ వినయ్ కుమార్ అంబులెన్స్ లోనే గురువారం ఉదయం 3:35 గంటలకి ప్రసవించారు. ఈ క్రమంలో మీనాక్షి పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నప్పటికీ మెరుగైన వైద్యం కోసం చౌటుప్పల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకువెళ్లారు. కాన్పు చేసిన ఈఎంటి వినయ్ కుమార్ ను పైలెట్ లింగస్వామి ను కుటుంబ సభ్యులు ప్రశంసించారు.
108 అంబులెన్స్ లో గర్భిణీ మహిళకు సుఖ ప్రసవం..
- Advertisement -
- Advertisement -