Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గర్భిణీలు పౌష్టిక ఆహారం తీసుకోవాలి: సీడీపీఓ మమత

గర్భిణీలు పౌష్టిక ఆహారం తీసుకోవాలి: సీడీపీఓ మమత

- Advertisement -

నవతెలంగాణ – మిర్యాలగూడ 
గర్భిణీలు పౌష్టిక ఆహారం తీసుకోవాలని సిడిపీఓ మమత కోరారు. బుధవారం పట్టణంలోని గాంధీనగర్ సెక్టార్ పరిధిలోని మొదట పాప పుట్టి, రెండవసారి గర్భిణీ గా ఉన్న లబ్ధిదారురాలు ఇంటికి  వెళ్లి గృహ సందర్శన చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీ  మంచి పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. బ్లడ్ శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. బిడ్డ పుట్టిన గంట లోపు ముర్రుపాలు పట్టించాలని వివరించారు. ఇటీవల కాలంలో అనేక రకాల శిశు విక్రయాలు జరుగుతున్నాయని, అది తీవ్రమైన నేరమని, ఎవరైనా శిశువులను విక్రయించేందుకు ప్రయత్నించినా, విక్రయించినట్లు తెలిసినా చట్ట పరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.  పుట్టేవారు పాపైనా, బాబు అయినా సమానంగా చూడాలని.. లింగ వివక్షత చూపకూడదని వివరించారు.  ఆడపిల్లల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్  నజీమా బేగం మొహ్మద్, బ్లాక్ కో ఆర్డినేటర్ కవిత, అంగన్వాడీ టీచర్ టి. అరుణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -