Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఈహెచ్‌ఎస్‌ విధివిధానాలు సిద్ధం చేయండి

ఈహెచ్‌ఎస్‌ విధివిధానాలు సిద్ధం చేయండి

- Advertisement -

అధికారులకు సీఎస్‌ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) విధి విధా నాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత ఈహెచ్‌ఎస్‌ విధి విధానా లపై సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో సీఎస్‌ సమీక్షించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అమలవుతున్న వివిధ పథకాలను, ఇన్సూరెన్స్‌ కంపెనీల విధానాలను అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరలో నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించా రు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగు లు వారి వేతనం నుంచి కొంత డబ్బును జమ చేసేం దుకు సిద్ధంగా ఉన్నారనీ, నగదు రహిత ఆరోగ్య చికిత్స విధానం ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్యం అందించాలని కోరుతున్నా రని అధికారులు వివరిం చారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి మొత్తం 7,14,322 మంది ఈహెచ్‌ఎస్‌ ద్వారా లబ్ధి పొందనున్నారని అన్నారు. ఈ పథకం కోసం ఏడాదికి సుమారు రూ.1,300 కోట్ల అంచనా వ్యయం అవుతుందని అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ, ఆర్ధిక శాఖ అధికారులు సమన్వయం తో ఆయా రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఈహెచ్‌ఎస్‌ విధి విధానాలను ఆధ్యయనం చేసి త్వరలో నివేదిక ను సిద్ధం చేయాలని సీఎస్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, విద్యా శాఖ కార్యదర్శి యోగితారాణా, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, జేఏడీ కార్యదర్శి బెన్హర్‌ మహేష్‌ దత్‌ ఎక్కా ఇతర ఉన్నతాధి కారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad