నవతెలంగాణ – జూక్కల్
దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం పిలుపుమేరకు ఆగస్టు 6న దేశ రాజధానిలోని జంతర్ మతర్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రములో జుక్కల్ మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ పడేలా ఆధ్వర్యంలో ఢిల్లీకి తరలి వెళ్లి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు సతీష్ పటేల్ మరియు మండల యువ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన 42 శాతం రిజర్వేషన్ బీసీ బిల్లు కేంద్రం ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పాస్ విధంగా మద్దతు చేస్తూ బీసీ బిల్లు చట్టసభలో ప్రవేశపెట్టి మద్దతు తెలపాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీలకు మద్దతుగా న్యాయం చేయాలని కోరుకుంటూ ధర్నాలో పాల్గొన్నామని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ( చిన్న ), జిల్లా నాయకులు, జుక్కల్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ పటేల్, యూత్ నాయకులు గంగాధర్ , సురేష్ , ప్రసాద్ , శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ కాంగ్రెస్ ధర్నాలో పాల్గొన్న మండల యువజన సంఘం అధ్యక్షుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES