Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంసుప్రీంకోర్టుకు రాష్ట్రపతి సూటి ప్రశ్నలు..

సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి సూటి ప్రశ్నలు..

- Advertisement -

నవతెలంగాణ న్యూఢిల్లీ: శాసనసభలు ఒకటికి రెండుసార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవీ తీవ్ర జాప్యానికి గురికావడంపై సుప్రీంకోర్టు ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ అంశంలో గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికీ గడువు విధించింది. దీనిపై తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పందించినట్టు తెలుస్తోంది. రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏమైనా ఉందా? అని ఆరా తీశారని… అలాంటి నింబంధనలు లేనప్పుడు.. సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని ముర్ము ప్రశ్నించినట్టు సమాచారం. ఈ మేరకు పలు ఆంగ్ల మీడియా కథనాలు వచ్చాయి.
రాజ్యాంగంలోని 143 ఆర్టికల్‌ కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకొని సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి పలు ప్రశ్నలు సంధించినట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈ ప్రశ్నలపై న్యాయస్థానం తమ అభిప్రాయాలను తెలియజేయాలని అడిగినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై స్పందించేందుకు నూతన సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

  • 1. రాష్ట్ర అసెంబ్లీ పంపించిన బిల్లును.. గవర్నర్ స్వీకరించిన తర్వాత ఆర్టికల్ 200 కింద రాజ్యాంగం సూచించిన నిబంధనలు ఏంటి..?
  • 2. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులపై నిర్ణయం తీసుకునే సమయంలో గవర్నర్.. కేబినెట్ నిర్ణయం, సలహాల మేరకు మాత్రమే వ్యవహరించాలా..?
  • 3. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద గవర్నర్ తీసుకున్న విచక్షణాధికార నిర్ణయం న్యాయ పరిశీలనకు లోబడి ఉంటుందా..?
  • 4. ఆర్టికల్ 200 కింద గవర్నర్ నిర్ణయాలు కోర్టుల సమీక్ష, విచారణల నుంచి ఆర్టికల్ 361 కాపాడుతుందా..?
  • 5. గవర్నర్ ఎంత సమయంలో నిర్ణయం తీసుకోవచ్చు అనే విషయంపై రాజ్యాంగంలో స్పష్టమైన కాల పరిమితి లేనప్పుడు.. బిల్లులపై నిర్ణయం తీసుకోవటానికి గవర్నర్లకు న్యాయ వ్యవస్థ గడువు విధించవచ్చా..?
  • 6. ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి విచక్షణాధికారాన్ని న్యాయ పరంగా సమీక్షించవచ్చా..?
  • 7. రాజ్యాంగబద్దమైన ఆదేశాలు లేనప్పుడు.. న్యాయపరంగా సూచించిన గడువునకు, కాలానికి  రాష్ట్రపతి కట్టుబడి ఉంటారా..?
  • 8. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులను గవర్నర్ రిజర్వ్ చేసినప్పుడు.. నిర్ణయం తీసుకోకుండా ఉన్నప్పుడు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరాలా..?
  • 9. బిల్లు చట్టంగా మారే ముందు.. గవర్నర్ లేదా రాష్ట్రపతి నిర్ణయాలలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా..?
  • 10. రాష్ట్రపతి లేదా గవర్నర్ నిర్ణయాలను తీసుకోవటానికి లేదా మార్పులు చేయటానికి ఆర్టికల్ 142 కింద అనుమతి ఉందా..?
  • 11. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లు గవర్నర్ ఆమోదం లేకుండా చట్టంగా మారుతుందా..?
  • 12. రాజ్యాంగ సవరణ ప్రశ్నలను ఆర్టికల్ 145(3) కింద ముందుగా రాజ్యాంగ ధర్మాసనానికి సూచించాలా..?
  • 13. ఆర్టికల్ 142 కింద.. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా.. కోర్టు తీర్పులను అనుమతిస్తుందా..?
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad