Monday, July 28, 2025
E-PAPER
Homeజాతీయంరాష్ట్ర బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి సూచన స‌రైందికాదు: కేర‌ళ‌

రాష్ట్ర బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి సూచన స‌రైందికాదు: కేర‌ళ‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తమిళనాడు గవర్నర్‌ కేసులో రాష్ట్రపతి సూచన తప్పుదారి పట్టించేలా ఉందని కేరళ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. తమిళనాడు గవర్నర్‌ కేసులో సుప్రీంకోర్టు తన అధికారిక ప్రకటనపై అప్పీలులో పాల్గొనేలా చేయడం కుట్ర అని, రాష్ట్రపతి సూచనను కొట్టివేయాలని కేరళ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును కోరింది. రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులను క్లియర్‌ చేయడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా లేదా తేల్చమని అని రాష్ట్రపతి 14 ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే.

సుప్రీంకోర్టు తన సొంత తీర్పులపై అప్పీలు చేసుకునేందుకు రాజ్యాంగం అనుమతించదు లేదా రాష్ట్రపతి సూచన ద్వారా కోర్టులో అప్పీలు అధికార పరిధిని రాష్ట్రపతి అధీనంలోకి తీసుకునేందుకు అనుమతించద‌ని కేరళ ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రపతి సూచన తప్పుదారి పట్టించేది, వాస్తవాలను తొక్కి పెట్టేదిగా ఉందని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోకపోతే, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 143 సలహా అధికార పరిధిలోని ప్రశ్నలను మాత్రమే రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు సూచించగలరని కేరళ తరుపున సీనియర్‌ న్యాయవాదులు కె.కె.వేణుగోపాల్‌, సి.కె.శశిలు వాదించారు.

1993లో కావేరీ జల వివాదాల ట్రైబ్యునల్‌లో ఇచ్చిన సూచనతో సహా న్యాయపరమైన ఉదాహరణలను ప్రస్తావించింది. ఏప్రిల్‌ 8న తెలంగాణ, పంజాబ్‌ తమిళనాడు రాష్ట్రాలు దాఖలు చేసిన కేసుల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200 మరియు 201 కింద గవర్నర్లు మరియు రాష్ట్రపతి అధికారాలు మూడు వేర్వేరు అధికారిక తీర్పులకు లోబడి ఉన్నాయని పేర్కొంది.

”ఒక చట్టపరమైన అంశంపై సుప్రీంకోర్టు చట్టానికి లోబడి అధికార పరిధిలో నిర్ణయం వెల్లడించినపుడు .. నిర్ణయంపై ఏదైనా సందేహం ఉందని చెప్పలేము లేదా అది నిర్ణయం కాని విషయం అని చెప్పలేము. తద్వారా రాష్ట్రపతి ఈ ప్రశ్నపై చట్ట పరిధిలో వాస్తవ స్థానం ఏమిటో తెలుసుకోవాలి. చట్టపరమైన ప్రశ్నపై కోర్టు నిర్ణయం అన్ని కోర్టులు, అధికారులపై కట్టుబడి ఉంటుంది. అందువల్ల కోర్టు నిర్ణయం తీసుకోనపుడు మాత్రమే రాష్ట్రపతి చట్టపరమైన ప్రశ్నను సూచించగలరు ” అని కేరళ ప్రభుత్వం పేర్కొంది.

ఏప్రిల్‌ 8న తమిళనాడు గవర్నర్‌ కేసులో జస్టిస్‌ జె.బి.పార్థివాలా తీర్పులో, మే నెలలో రాష్ట్రపతి సూచనలో లేవనెత్తిన ప్రశ్నలను ఇప్పటికే వివరంగా ప్రస్తావించారని కేరళ ప్రభుత్వం హైలెట్‌ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 8 తీర్పును సవాలు చేయాలనుకుంటే, సుప్రీంకోర్టులో సమీక్ష లేదా క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేసి ఉండాల్సిందని, రాష్ట్రపతి సూచన మార్గాన్ని ఎంచుకోకూడదని పేర్కొంది. ఏప్రిల్‌ 8 తీర్పుని సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం కోరలేదని, దానిని స్థిరమైన చట్టంగా నిర్థారించిందని పేర్కొంది. ”తమిళనాడు కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా కేంద్రం సమీక్ష లేదా క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేయలేదు అంటే తీర్పును అంగీకరించింది. ఈ తీర్పు చెల్లుబాటు అయ్యే ఏ విచారణలోనూ దాడి చేయబడకుండా లేదా కొట్టివేయబడకుండా, అంతిమస్థితికి చేరుకుంది. అలాగే ఆర్టికల్‌ 141 కింద సంబంధిత వర్గాలకు కట్టుబడి ఉంటుంది. సూచన వంటి దాయాది సంబంధిత చర్యల్లో పరోక్షంగా సవాలు చేయబడదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 144 ప్రకారం.. రాష్ట్రపతి, కేబినెట్‌ సుప్రీంకోర్టుకు అనుకూలంగా వ్యవహరించాలి” అని కేరళ ప్రభుత్వం వాదించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -