నవతెలంగాణ-హైదరాబాద్ : మణిపుర్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 13న అక్కడి ముఖ్యమంత్రిగా కొనసాగుతోన్న బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. ఈ క్రమలోనే రాష్ట్రంలో పాలన రద్దు కాగా.. అప్పటి నుంచి రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. మణిపుర్లో శాంతి భద్రతలు దిగజారడం, రెండు తెగల మధ్య ఘర్షణలు, పరస్పర ద్వేషాలు తీవ్రరూపం దాల్చడంతో రాష్ట్రపతి పాలనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, అక్కడ పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుండటంతో తాజాగా కేంద్రం మణిపుర్‌లో రాష్ట్రపతి పాలనను పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో విషయంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభకు అందుకు ఆమోదం తెలిపింది. తాజాగా పరిణామంతో మణిపుర్ మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. అందుకు సంబంధించి రాష్ట్రపత్రి కార్యాలయం నుంచి నోటిఫికేషన్ వెలువడింది. ఫిబ్రవరి 2026 వరకు మణిపూర్ రాష్ట్రం ప్రెసిడెంట్ రూల్‌లో ఉండనుంది.
మణిపుర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES