Friday, November 7, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఒత్తిడి ఎత్తుగడల వల్ల ఫలితం లేదు

ఒత్తిడి ఎత్తుగడల వల్ల ఫలితం లేదు

- Advertisement -

అమెరికా ఆంక్షలపై ఉత్తర కొరియా నిరసన
సియోల్‌ : సైబర్‌ నేరాలను లక్ష్యంగా చేసుకుంటూ ట్రంప్‌ ప్రభుత్వం తాజాగా విధించిన ఆంక్షలపై ఉత్తర కొరియా గురువారం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. తమ దేశం పట్ల అమెరికా ఘర్షణా వైఖరిని అవలంబి స్తోందని, తాము కూడా ప్రతీకార చర్యలు తీసుకుంటామని ఉత్తర కొరియా ఉప విదేశాంగ మంత్రి కిమ్‌ ఉన్‌ చోల్‌ పేర్కొన్నారు. సైబర్‌ నేరాల పథకాల ద్వారా మనీ లాండరింగ్‌ పాల్పడుతున్నారంటూ ఉత్తరకొరియా బ్యాంకర్లతో సహా 8మంది వ్యక్తులపై, రెండు సంస్థలపై మంగళవారం అమెరికా ఆర్థిక విభాగం ఆంక్షలు విధించింది.

ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా స్పందిస్తూ అమెరికా ఆంక్షలు, ఒత్తిడి తీసుకువచ్చే ఎత్తుగడల వల్ల ఎలాంటి ఫలితాలు వుండబోవని స్పష్టం చేసింది. దీనివల్ల ఉత్తర కొరియా ఆలోచనా వైఖరి, అభిప్రాయాలు మారబోవని, ప్రస్తుతమున్న వ్యూహాత్మక పరిస్థితులు మారవని కిమ్‌ ఉన్‌ చోల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దౌత్యాన్ని పునరుద్ధరించాలంటే ముందుగా అణ్వాయుధాలను విడనాడాలంటూ అమెరికా చేసిన డిమాండ్‌ను కిమ్‌ ఇటీవల తోసిపుచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -