Monday, January 12, 2026
E-PAPER
Homeజాతీయం'ప్రెవెంటివ్‌ డిటెన్షన్‌' కస్టడీ పొడిగింపునకు కాదు

‘ప్రెవెంటివ్‌ డిటెన్షన్‌’ కస్టడీ పొడిగింపునకు కాదు

- Advertisement -

సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ :
కేవలం నిందితుడి కస్టడీని పొడిగించానికి ‘ప్రెవెంటివ్‌ డిటెన్షన్‌’ను ప్రయోగించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేరస్థుడు నేరాలు చేసే అలవాటు మార్చుకోవడానికి నిరాకరించాడని, బెయిల్‌పై బయటకు వచ్చిన తరువాత కూడా అతను మళ్లీ నేరం చేస్తాడనే భయం, అనుమానంతో ‘ప్రెవెంటివ్‌ డిటెన్షన్‌’ను ప్రయోగించకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. నిజంగా ఒక నిందితుడు బెయిల్‌పై బయటకు వచ్చిన తరువాత మళ్లీ నేరం చేస్తే, అటువంటి పరిస్థితిని సాధారణ చట్టం కింద బెయిల్‌ను రద్దు చేయడం ద్వారా లేదా ఉన్నత న్యాయస్థానాల్లో బెయిల్‌ను సవాల్‌ చేయడం ద్వారా పరిష్కరించవచ్చనని సుప్రీంకోర్టు సూచించింది. అంతేకాని ఇలాంటి పరిస్థితి ‘ప్రెవెంటివ్‌ డిటెన్షన్‌’ను ప్రయోగించడానికి ఏకైక కారణం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. మాదక ద్రవ్యాల నివారణ (ఎన్‌డీపీఎస్‌) చట్టం కింద మూడు కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న ఒక మహిళపై విధించిన ‘ప్రెవెంటివ్‌ డిటెన్షన్‌’ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎన్‌డీపీఎస్‌ కేసులు శాంతిభద్రతలకు ముప్పు అని నిరూపించవని సుప్రీంకోర్టు పేర్కొంది.

హైదరాబాద్‌ కలెక్టర్‌ ఉత్తర్వలతో ‘ప్రెవెంటివ్‌ డిటెన్షన్‌’ను ఎదుర్కొంటున్న ఒక మహిళ వేసిన పిటిషన్‌ విచారణలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఇలాంటి కేసులు నమోదై నిర్భంధంలో వ్యక్తికి బెయిల్‌ మంజూరైన పక్షంలో.. ఆ వ్యక్తి పబ్లిక్‌ ఆర్డర్‌కు హానీ కలిగించే నేరాలకు పాల్పడే అవకాశం ఉందని నిర్భంధించే అధికారి భయం ‘ప్రెవెంటివ్‌ డిటెన్షన్‌’ను విధించడానికి సరిపోదు’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఆమెపై ‘ప్రెవెంటివ్‌ డిటెన్షన్‌’ నిర్భంధాన్ని రద్దు చేసింది. ఈ కేసు పూర్తి వివరాల ప్రకారం జ్యూడిషయల్‌ కస్టడీలో ఉన్న పిటిషన్‌దారు, నిందితరాలుపై హైదారాబాద్‌ కలెక్టర్‌, జిల్లా మేజిస్ట్రేట్‌ ఆమె మరో నేరం చేయకుండా నిరోధించడానికి.. ఆమెకు బెయిల్‌ లభించినా ‘ప్రెవెంటివ్‌ డిటెన్షన్‌’ విధించేలా ఆదేశాలు జారీ చేశారు. ఆమె మళ్లీ గంజాయి అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ప్పాలడుతుందనే భయాన్ని వ్యక్తం చేస్తూ కలెక్టర్‌ ఈ విధంగా తెలిపారు. ‘మీరు సాధారణ చట్టానికి లొంగరని నేను గట్టిగా నమ్ముతున్నాను. చివరి ప్రయత్నంగా ప్రజా ప్రయోజనం దృష్ట్యా ‘ప్రెవెంటివ్‌ డిటెన్షన్‌’ కింద నిర్భంధంలోకి తీసుకుంటున్నాం’ అని చెప్పారు. దీన్ని సవాల్‌ చేస్తూ మహిళ ముందుగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆమె అభ్యర్థననను హైకోర్టు తిరస్కరించింది. కలెక్టర్‌ భయం, ఆందోళన ఆమెను ‘ప్రెవెంటివ్‌ డిటెన్షన్‌’ కింద నిర్భంధంలోకి తీసుకోవడానికి సరిపోతాయని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ విచారించిన సుప్రీంకోర్టు లా అండ్‌ ఆర్డర్‌కు, పబ్లిక్‌ ఆర్డర్‌కు మధ్య వ్యత్యాసం ఉందని ఇది వరకే స్పష్టమైందని తెలిపింది. ఎన్‌డిపిఎస్‌ కేసుల్లో ఉన్న నిందితురాలి చర్యలు ప్రజారోగ్యానికి ప్రమాదకరమైనవి చెప్పడానికి తగిన సాక్ష్యం లేనంత వరకు, ఆమెపై మూడు ఎన్‌డీపీఎస్‌ కేసులు ఉండటం శాంతిభద్రతలపై ఎలాంటి ప్రభావం చూపదని సుప్రీంకోర్టు తెలిపింది. ఒకవేళ నిందితురాలు బెయిల్‌ షరతులను ఉల్లంఘించారని అధికారి భావిస్తే, ఆమె స్వేచ్ఛను రద్దు చేయడానికి తగిన చర్యలను తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -