Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంమూడు వందేభారత్‌ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

మూడు వందేభారత్‌ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

- Advertisement -


నవతెలంగాణ-హైద‌రాబాద్‌: దేశ ప్రధానమంత్రి మోడీ బెంగళూరులో పర్యటిస్తున్నారు. ఆదివారం కేఎస్‌ఆర్‌ రైల్వే స్టేషన్‌ నుండి మూడు వందే భారత్‌ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో బెంగళూరు-బెళగావి, మాతా వైష్ణోదేవి కాత్రా-అమృత్సర్‌, నాగ్‌పూర్‌-పుణే వందే భారత్‌ రైళ్లు ఉన్నాయి. తరువాత, ఎలక్ట్రానిక్‌ నగరాన్ని బొమ్మనహళ్లితో అనుసంధానించే ఎల్లో లైన్‌ మెట్రో సేవను ప్రధానమంత్రి ప్రారంభించారు. బెంగళూరు-బెళగావి వందేభారత్‌ రైలులో ప్రయాణించి విద్యార్థులతో ముచ్చటించారు. మధ్యాహ్నం తరువాత రెండు కారిడార్లతో కూడిన నమ్మ మెట్రో మూడవ దశకు మోడీ పునాది రాయి వేస్తారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img