Sunday, December 21, 2025
E-PAPER
Homeజాతీయంగువహతి ఎయిర్‌పోర్టు కొత్త టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

గువహతి ఎయిర్‌పోర్టు కొత్త టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

- Advertisement -

గువహతి : భారత ప్రధాని మోడీ.. అసోం రాజధాని గువహతిలో గల లోకప్రియ గోపినాథ్‌ బర్దోలయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ను శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ టెర్మినల్‌ను ఏడాదికి 1.31 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగల సామర్థ్యంలో నిర్మించారు. ఈ టెర్మినల్‌ నిర్మాణానికి మొత్తం రూ.4వేల కోట్లు ఖర్చు చేశారు. అసోం మాజీ ముఖ్యమంత్రి గోపినాథ్‌ బర్దోలోయ్ పేరు మీద గువహతి విమానాశ్రయానికి ఆ పేరు పెట్టారు.

విమానాశ్రయం వెలుపల గోపినాథ్‌ బర్దోలోరుకు చెందిన 80 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని గతంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. నూతన టెర్నినల్‌ నిర్మాణ ప్రాజెక్టు మొత్తం విలువ రూ.5 వేల కోట్లు కాగా… రూ. 4 వేల కోట్లు ఖర్చయ్యింది. మరో రూ. 1000 కోట్లను మెయింటెనెన్స్‌, రిపేర్లు, ఇతర సౌకర్యాలు సమకూర్చుకోవడం కోసం పక్కన పెట్టారు. ఆగేయాసియాకు గేట్‌వేగా, ఈశాన్య భారతానికి కీలక ఏవియేషన్‌ హబ్‌గా ఉండాలనే లక్ష్యంతో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -