నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని మోడీ ఇండియాకు బయలుదేరనున్నారు. చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న ఎస్‌సీవో సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. సమావేశానంతరం మోడీ-పుతిన్ ప్రత్యేకంగా కలుసుకుని చాలా సేపు సంభాషించుకున్నారు. ఇరుదేశాల ద్వైపాక్షిక చర్చలపై ఇరు దేశాల అధినేతలు చర్చించుకున్నారు. అదే విధంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తో కూడా ప్రధాని మోడీ భేటీ అయ్యారు. సరిహద్దుల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకొని, ఇరు దేశాలు ముందుకెళ్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతే కాకుండా పెహల్గాం ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ షాంఘై సభ్యుదేశాలు తీర్మానం చేశాయి. ప్రపంచంలో ఏ రూపంలో ఉన్న ఉగ్రవాదాన్ని అంతమొందించాలని సభ్య దేశాలు పిలుపునిచ్చాయి.
ఇండియాకు బయలుదేరిన ప్రధాని మోడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES