నవతెలంగాణ-హైదరాబాద్ : మాల్దీవ్స్ పర్యటనను ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ భారత్ చేరుకున్నారు. ఈ క్రమంలో తమిళనాడు పర్యటనలో భాగంగా.. తెల్లవారుజామున తమిళనాడుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రధాని మోడీకి స్వాగతం పలికాడు. తమిళనాడులో ప్రధాని మోడీ పంచకట్టుతో తమిళనాడు గడ్డపై అడుగుపెట్టాడు. నాలుగు రోజుల విదేశీ పర్యటన అనంతరం శ్రీరాముడి పవిత్ర భూమికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపిన ప్రధాని మోడీ తెలిపారు. అలాగే తన నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య చారిత్రాత్మక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు వివరించారు. ఈరోజు ప్రధాని మోడీ గంగైకొండ చోళపురం లో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తమిళనాడు పర్యటనలో ప్రధాని మోడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES