- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని ప్రభుత్వం ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ఉత్తమ అవార్డ్, ప్రశంస పత్రాలు అందజేశారు. ఇందులో భాగంగా మండల కేంద్రమైన తాడిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్స్ పాల్ విజయదేవి కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థుల సంఖ్యతోపాటు ఉత్తీర్ణతను పెంచేలా కృషి చేసిన సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ డాక్టర్ చెల్లయ్య నాయక్, కలెక్టర్ రాహుల్ శర్మ,ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబుల చేతులమీదుగా ఉత్తమ ప్రిన్స్ పాల్ గా అవార్డ్,ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.
- Advertisement -